Saturday, July 31, 2010

అశ్రునయనం

క్షణ క్షణం నీ ఙ్నాపకాల తోరణం,
మదిలొ మెదిలే ఆ ఙ్నాపకాల తో, నా రణం.
ఆర్తిగా చేరాలని ఆరాటం,
అందీ అందని ద్రాక్ష అని తెలిసీ అగదు ఈ పోరాటం.
విధి చేసె వింతలను చూస్తూ, విస్తు పోయిన వైనం,
మరిక నా దగ్గర మిగిలినదే ఈ అశ్రునయనం.

Friday, July 30, 2010

“స్నేహగీతం”

చిరునవ్వుతో,చిరుజల్లులా పలకరించేది స్నేహం,
దూరాలను కొలవని మధురభావం స్నేహం,
మనసు చేసే వెన్నెలప్రయాణం స్నేహం,
జీవితమనే ప్రయాణం లో దిక్సూచి స్నేహం,
మన మనసు ప్రతిబింబమై నిలిచేది స్నేహం,
మనలోంచి, మనసులోతుల్లోంచి పుట్టేది స్నేహం,
ఎల్లప్పుడూ, నీ తోడు నేనున్నాననేది స్నేహం,
కాలంతో, వసి వాడని కుసుమ సుగంధం స్నేహం,
అంతరంగాలను తడిమేది,తట్టి లేపేది స్నేహం,
రాగ,ద్వేషాలకు,ఈర్ష్యాసూయ లకు అతీతమీ స్నేహం,
ఈ జీవావరణానికి, దేవుడిచ్చిన వర "మీ స్నేహం",
అనునిత్యం మనసుపాడే మౌనగీత "మీ స్నేహం",
ఇదే మన మిత్రావళికి నా “స్నేహగీతం”.



HAPPY  FRIENDSHIP  DAY

Thursday, July 29, 2010

నీ నవ్వు

నీ కళ్ళల్లో కాంతులు చూసి, నా గుండెల్లో దీపావళి,

నీ మోమున మెరిసే మెరుపులు చూసి,నా మనసంతా సంక్రాంతి,

నీ అధరాల ఇంద్రధనువులతో, నాకు నిలువెల్ల హోళీ,

మనసారా నవ్వుతున్న నిన్ను గానీ, చూసానా, నాకిక అన్ని పండుగలూ ఆనాడే.

స్నేహం కోసం


సృష్టిలో తీయనిది స్నేహమని కవులన్నారు
శాకం ఎంత మధురమైన , కొంత దాటితే జిహ్వ ఇక చాలంటుంది.
హద్దులులేని , ఎల్లలుదాటి సాగే ఈ స్నేహ మధురిమ
ఎంతగ్రోలినా ఆ దాహర్తి తీరనిది,ఆ క్షుద్భాద చల్లారనిది.
అందుకే ఈ మనసెప్పుడూ స్నేహం కోసం ఇంకా , ఇంకా అంటుంది

దేశప్రగతి

నిండు చందమామ నా చేతుల్లో ....,

పండు వెన్నెల నా దోసిట్లో .....,

వేల నక్షత్రాలు నా ఒడిలో ....,

భూమ్యాకాశాలు నా కౌగిలిలో ....,

నింగికెగిసాను జోరుల్లో,హుషారుల్లో.......,

నింపాను,ఆనందభాష్పాలు మీ కళ్ళల్లో.....,

దేశప్రగతి మీ ముంగిట్లో.......,

నా అలుపెరగని పయనం రోదసి కక్ష్యల్లో.....,

నా పరిచయం PSLV C-15.

ఈ దేశ శాస్త్రవేత్తల ముద్దు బిడ్డని నేను.



( PSLV విజయ వంతమైన సందర్భంగా)

Tuesday, July 27, 2010

ఈ స్నేహం కాదిది e-స్నేహం..

రెప్పలు ఆర్పని కళ్ళు,


కీ బోర్డ్ పై కదలని వేళ్ళు,


గడియారం లొ భారం గా కదిలే ముళ్ళు,


ఆగి ఆగి వచ్చే ఉశ్వాస నిశ్వాసలు,


పదే పదే రిఫ్రెష్ బటన్ పై క్లిక్కులు,


నేస్తాల మెయిళ్ళ కోసం ఎదురుచూపులు,


అన్నీ కలసి e-స్నేహమాధుర్యానికి సాక్ష్యాలు..


ఈ స్నేహం కాదిది  e-స్నేహం..

కాలేజీ బ్యూటీ , క్లాసుకి వస్తే...





చందమామ ప్రక్కన కూర్చున్నట్టయింది నాకు,

ఆ తరవాతే తెలిసింది అది నీ మోమని,

నీలాకాశం నావెంటే ఉన్నట్టయింది నాకు,

ఆ తరవాతే తెలిసింది అది నీ వోణీయని.

కెంపుల రంగేమిటో తెలిసింది నీ చుబుకం చూసాకే,
గులాబీ రేకలనుకున్నా, కావవి నీ అధరాలట..
చూసే కొద్దీ చూడాలని పించే అందమా,

అందానికే అర్ధం తెలిపే అందమా,ఆనందమా,
వెన్నెలవా, వేకువవా , ఆ రెండూ కలగలిపిన ముగ్ధమోహనమా,
ఈ తరగతికే అలంకారమా,
నీకిదే ఈ భావుకుడి స్వాగతం.

Monday, July 26, 2010

ఓ స్నేహమా నీకేమైనా సందేహమా??

మంచి గంధం సువాసన ఆఘ్రాణించినపుడు,
పసిపాపల బోసినవ్వులు చూసినపుడు,
పన్నీరు పైపైన చిలకరించినపుడు,
దేవాలయం లో కర్పూర హరతి కళ్ళకద్దుకున్నపుడు,
తొలకరి వానలో తడిసినపుడు,
ఆ వానలో మట్టివాసన పీల్చినపుడు,
ఆ చిరు జల్లుల మధ్య మొక్కజొన్న కంకి తిన్నప్పుడు,
వెన్నెల్లొ గోదారిని చూసినపుడు,
పిల్లతెమ్మర తనువును తాకినపుడు,
వేకువ ఝామున మేలుకొలుపు విన్నప్పుడు,
కలిగే అనిర్వచనీయమైన అనుభూతి కన్నా,
ఈ పేజీ లో పాత స్నేహితులందిరినీ పలకరించినపుడు కలిగే అనుభూతి మిన్న.
ఓ స్నేహమా నీకేమైనా సందేహమా??
వీలుంటే......కాదు,కాదు...,వీలు చేసుకుని మరీ రావమ్మా.... ఓ స్నేహమా,
మా ఊసుల,బాసల పేజీ లోకి నీకు మాత్రమే
స్వాగతం ..............,సుస్వాగతం...............,
ఇదే నా స్వగతం.






(ఈ కవిత మా కాలేజీ పాత స్నేహితుల కోసం గూగుల్ గ్రూప్స్ లో రాసినది.)